రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న ఓ హనుమాన్ దేవాలయాన్ని అధికారులు వెనక్కి జరుపుతున్నారు. యూపీ షాజన్ పూర్ జిల్లా కచియాని ఖేడా ప్రాంతంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. లఖ్ నవూ- ఢిల్లీ జాతీయ రహదారిని ఆనుకొని 5 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 64 అడుగుల పొడవు, 36 అడుగుల వెడల్పుతో హనుమాన్ ఆలయం ఉంది. ఈ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం ధ్వంసం కాకుండా ఎనిమిది అడుగులు వెనక్కి జరపాలని నిర్ణయించుకున్నారు. హర్యాణాకు చెందిన ఓ కంపెనీ అక్టోబరులో ఈ పనులు ప్రారంభించింది. జాకీలతో ఎత్తుపెంచి ఎనిమిది అడుగులు ఆలయాన్ని వెనక్కి జరిపింది. ఆలయం సిద్ధం కావడానికి మరో నెల రోజులు పట్టనుంది.