తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో ఘోరం జరిగింది. నామక్కల్ జిల్లా మోగనూర్లో తిల్లైకుమార్ బాణాసంచా దుకాణం నడుపుతున్నాడు. శుక్రవారం రాత్రి శివకాశి నుంచి బాణసంచా తెప్పించి ఇంట్లోని ఓ గదిలో భద్రపరిచాడు. శనివారం వేకువజామున ప్రమాదవశాత్తు బాణసంచా పేలి, వంట గదిలోని గ్యాస్ సిలిండర్‌కు అంటుకోవడంతో పెద్ద శబ్దంతో పేలింది. దీంతో వారి ఇంటితో పాటు పక్కన ఉన్న 5 గృహాలు కూలాయి. ప్రమాదంలో తిల్లైకుమార్తోపాటు అతని భార్య, తల్లి కూడా సజీవదహనమయ్యారు. పక్కింట్లో ఉండే ఓ మహిళ కూడా మంటల్లో కాలిపోయింది.