ఉత్తరాఖండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉందని, అతను వేగంగా కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులతో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి ఉత్తరాఖండ్ వెళ్ళేటప్పుడు, అతడు ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పంత్కు నుదిటితో పాటు, మోకాలు, వీపు భాగంలో గాయాలయ్యాయి. పంత్కు చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేశారు.