క్రికెట్ ఆధారిత 'డ్రీమ్ 11' బెట్టింగ్ యాప్ గురించి తెలిసే ఉంటుంది. బీహార్ కు చెందిన ఓ వ్యక్తికి ఈ బెట్టింగ్ యాప్ లో జాక్ పాట్ తగిలింది. నవాదా జిల్లాలోని పిప్రాకు చెందిన రాజురామ్ డీజేగా పనిచేస్తున్నాడు. గత ఏడాదిన్నరగా డ్రీమ్ 11 లో బెట్టింగ్ వేస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బీపీఎల్ టోర్నీకి సంబంధించి రూ.49తో పందెం కాశాడు. బ్రిస్బేన్ హిట్, సిడ్నీ థండర్ మధ్య జరిగిన మ్యాచ్ లో తనకు నచ్చిన ఆటగాళ్లతో ఉత్తమ జట్టును ఎంపిక చేశాడు. ఆ జట్టే అగ్రస్థానంలో నిలవడంతో రూ.కోటి గెలుచుకున్నాడు. గెలుచుకున్న కోటిలో రూ.30 లక్షలు పన్నులు పోగా మిగిలిన రూ.70 లక్షలు అతడి ఖాతాలో జమయ్యాయి.