ఉత్తర కొరియా శనివారం మరో మూడు మిస్సైళ్లను ప్రయోగించింది. 3 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను తన తూర్పు జలాల్లోకి ప్రయోగించింది. ఉత్తర ప్రాంతంపై అంతరిక్షం నుంచి నిఘా సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు దక్షిణ కొరియా ఘన ఇంధన రాకెట్‌ను ప్రయోగించిన మర్నాడే ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగించడం గమనార్హం. ఆ క్షిపణులు కొరియా ద్వీపం, జపాన్ మధ్య జలాల్లో 350 కిలోమీటర్లు దూరం ప్రయాణించినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa