నోటి దుర్వాసన చాలామందిని వేధించే సమస్య. దీనికి నోటిని శుభ్రంగా ఉంచుకోవటం ప్రధానం. దీంతో బ్యాక్టీరియా వృద్ధి కాకుండా, పేరుకుపోకుండా చూసుకోవచ్చు. ద్రవాలు తగినంత తాగాలి. మద్యం, పొగాకు నోరు ఎండిపోయేలా చేస్తాయి కాబట్టి వీటిని మానెయ్యాలి. చక్కెరలేని చూయింగ్ గమ్ నమిలితే మంచిది. ఇది లాలాజలం ఊరేలా చేస్తుంది. ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, ఘాటు వాసనలతో కూడిన మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి. అల్పాహారంగా పచ్చి కూరగాయలు, పండ్ల ముక్కలను నమిలి తినటం మంచిది. ఇవి లాలాజలం ఊరేలా చేస్తాయి. నాలుక వెనక భాగంలో పేరుకున్న పాచిని తొలగిస్తాయి.