నూతన సంవత్సర వేళ ఉక్రెయిన్పై దాడులు ముమ్మరం చేసింది రష్యా. తమ ఆత్మీయులను కలుసుకునేందుకు ఉక్రెయిన్ పౌరులు స్వదేశానికి తిరిగి వస్తున్న వేళ రష్యా ఆ దేశంపై దాడులను ఉద్ధృతం చేసింది. ఈ క్రమంలో శనివారం రష్యా కీవ్ సహా పలు నగరాలపై జరిపిన దాడుల్లో ఒకరు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. మొత్తం మీద 20 క్రూజ్ క్షిపణులను రష్యా ప్రయోగించగా, వాటిలో 12 మిస్సైళ్లను ఉక్రెయిన్ సైనికులు నేల కూల్చారు.