నూతన సంవత్సరం సందర్భంగా అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేయనున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఆదివారం అయోధ్యను దాదాపు 50 లక్షల మంది సందర్శించబోతున్నారు. భారీ స్థాయిలో భక్తులు ఆలయానికి వస్తుండటంతో అధికారులు అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. రద్దీని నియంత్రించేందుకు, తొక్కిసలాట జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా గతేడాది మొత్తం 2.5 కోట్ల మంది భక్తులు రామజన్మ భూమిని దర్శించుకున్నారు.