ప్రజలంతా బాణాసంచా వెలుగుల్లో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తే, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మాత్రం క్షిపణి ప్రయోగంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 2022లో రికార్డు స్థాయిలో ఆయుధ ప్రయోగ పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా నిన్న కూడా తూర్పు జలాల్లోకి ఓ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఇక భవిష్యత్లో అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని, మరింత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణులను తయారు చేస్తామని కిమ్ ప్రకటించారు.