హరియాణా క్రీడాశాఖ మంత్రి, మాజీ హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. సందీర్ సింగ్ తనను కావాలని తాకాడని, అసభ్యకరంగా మాట్లాడాడని జూనియర్ కోచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోచ్ ఫిర్యాదు మేరకు ఛండీగడ్ పోలీసులు ఐపీసీ 354, 354ఏ, 354బీ, 342, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అనంతరం బాధిత మహిళ మాట్లాడుతూ మంత్రి వేధింపులకు వ్యతిరేకంగా పోరాడలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. తనకు బెదిరింపులు వస్తున్నాయని, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.