రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్.. చాలామంది అబ్బాయిలకు డ్రీమ్ బైక్. ఇది మార్కెట్లోకి వచ్చి దశాబ్దాలు అవుతున్నా, ఇప్పటికీ దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మార్కెట్లో బుల్లెట్ 350సీసీ బైక్ విలువ రూ. 2.2 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కానీ ఒకప్పుడు ఈ బైక్ ధర కేవలం రూ. 18,700 మాత్రమేనన్న విషయం మీకు తెలుసా? అవును.. 1986లో దీని ఖరీదు వేలల్లోనే ఉండేది. ఇందుకు సంబంధించిన బిల్లును ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయటంత నెట్టింట తెగ వైరల్ అవుతుంది.