ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్ల సొమ్ములో నకిలీ నోట్లు కలకలం రేపాయి. యర్రగొండపాలెం మండలం ఎస్సీ కాలనీలో వాలంటీరు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఓ లబ్ధిదారు పింఛను నగదుతో ఓ దుకాణానికి వెళ్లగా అందులో నకిలీ నోట్లను గుర్తించారు. వాలంటీరు పరిశీలించగా, పంపిణీ సొమ్ములో మరిన్ని నకిలీ నోట్లు కనిపించాయి. దీంతో గ్రామంలో ₹19వేల విలువైన ₹500 నకిలీ నోట్లను లబ్ధిదారుల నుంచి వాలంటీరు తీసుకొని అధికారులకు అప్పగించారు.