న్యూ ఇయర్ రోజున కేరళ మలప్పురంలోని తిరూర్ లో విషాదం చోటుచేసుకుంది. టూర్ కు వెళ్లి తిరిగివస్తున్న కాలేజీ విద్యార్థుల బస్సు బోల్తా పడటంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయం 1.15 సమయంలో ఆ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. కొండ ప్రాంతంలో బస్సు నడిపిన అనుభవం డ్రైవర్ కు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. రాత్రి సమయం కావడంతో సహాయ చర్యలకు ఇబ్బంది ఎదురైంది.