దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికను నమ్మించి మోసం చేసిన యువకుడిపై శనివారం పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇస్లాంపేట పరిసర ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువతిని పిట్టవానిపాలేనికి చెందిన అదపురెడ్డి కిశోర్ అనే యువకుడు ఏడాది కాలంగా ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికి గర్భవతిని చేశాడు. దీంతో తనను వివాహం చేసుకోవాలని ఆ యువతి ఆరు నెలలుగా అడుగుతుండడంతో పరారైపోయాడు. దీంతో ఆ యువతి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా కిశోర్ స్వస్థలం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం అని, ఇక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో పొక్లయినర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కిశోర్ కోసం గాలిస్తున్నామన్నారు.