ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుండి సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నాడు. మస్క్ ఓ వైపు పొదుపు చర్యలు చేస్తుంటే పారిశుద్ధ్య సిబ్బంది వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. దీంతో మస్క్ వారందరినీ పీకిపడేశారు. దాంతో నిర్వహణ లేక బాత్రూంలు కంపు కొడుతున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి టాయిలెట్ పేపర్ కూడా దిక్కు లేక ఇంటి నుండి తెచ్చుకుంటున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. నిర్వహణ భారం తగ్గించుకునేందుకు ఉద్యోగులందరినీ రెండస్తుల్లోనే కుక్కి నాలుగింటిని ఖాళీ చేశారట. సిబ్బందిని వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోం చేయాలని చెబుతున్నారు.