డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫోన్ వాడొద్దని చెప్పినా చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల 2021లో 1,997 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో మెుత్తం 1,040 మంది మరణించారు. ఈ మేరకుకేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది. 2021లో సిగ్నల్ జంపింగ్ వల్ల 555 యాక్సిడెంట్‌లు జరిగాయని ప్రభుత్వ నివేదిక తెలిపింది. ఈ ఘటనల్లో 222 మంది మృతి చెందారట. అలాగే రోడ్లపై గుంతల కారణంగా 3,625 ప్రమాదాలు జరిగి 1,484 మంది మృత్యువాత పడ్డారని కేంద్రం వెల్లడించింది.