కొత్త సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కలిసికట్టుగా పని చేద్దామని అధికారులను జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్లోని స్పందన హాలు నందు హ్యాపీ న్యూ ఇయర్ 2023 వేడుకలలో భాగంగా కేక్ ను కట్ చేసి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్ పాల్గొన్నారు. వారిని వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు, పండ్లను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాల కనుగుణంగా నూతన సంవత్సరంలో జిల్లా అభివృద్ధి, ప్రజల మన్ననలు పొందేందుకు సమిష్టిగా నూతనోత్తేజంతో పనిచేద్దామని కలెక్టర్ పేర్కొన్నారు. మనమంతా కలిసి మెలిసి కనివిని ఎరుగని విజయాలు సాధిద్దామన్నారు. డిఆర్ ఓ కొండయ్య, ఆర్ డిఓలు భాగ్య రేఖ, రాఘవేంద్ర, తిప్పి నాయక్, స్పందన తాసిల్దార్ గోపాలకృష్ణ, కలెక్టరేట్ ఏఓ , కలెక్టరేట్ రెవిన్యూ సిబ్బంది జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం, పూల మొక్కలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ని కలిసిన వారిలో డిపిఓ విజయ కుమార్ , సిపిఓ విజయ్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి రామకృష్ణ, జిల్లా గృహ నిర్మాణ శాఖ చంద్రమౌళి రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ సుబ్బారావు, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఈ రషీద్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చాంద్ భాషా, ఆర్టీవో కరుణ సాగర్ రెడ్డి డిఆర్డిఏ పిడి నరసయ్య, డ్వామా పిడి రామాంజనేయులు డిఇఓ మీనాక్షి, , డి సి హెచ్ ఓ తిపేంద్ర నాయక్, సాంఘికసంక్షేమ శాఖ డి. డి. శివరంగ ప్రసాద్ , వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.