ముచ్చటైన జగనన్న పాలన 30 ఏళ్లు ఉండాలని ఆదివారం శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తెలియజేశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం జగనన్న సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని తెలిపారు. జగనన్న సంక్షేమ పథకాలతో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. కొత్త సంవత్సరం పేదవాళ్ల ఆరోగ్యం కోసం ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థను జగనన్న తీసుకువస్తున్నారని అన్నారు. అలాగే బీపీ ట్యాబ్లెట్ల దగ్గర నుంచి అన్ని కూడా అందుబాటులో ఉంచుతారని అన్నారు. మీ చదువు, ఆరోగ్యం కోసం ఎవరూ కష్టపడకుండా చూడాలన్నదే జగనన్న అభిమతమని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa