మడకశిర మండలం నిలకంఠాపురం గ్రామంలో మాజీ పి సీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి దంపతులకు పెనుకొండ నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆదివారం తెలిపారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు నీలకంఠపురంలోని దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని మాజీమంత్రి రఘువీరా రెడ్డి దంపతులకు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జ్ పాలసముద్రం నరసింహులు, గోరంట్ల మండలం కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బోయ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు రాజారెడ్డి , మండల కన్వీనర్ బోయ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి రాగి మేకల పల్లి నరసింహులు, సోమందేపల్లి కన్వీనర్ గంగాధర్, లాయర్ సుదర్శన్ రెడ్డి, నిషార్, లాయర్ లక్ష్మీనారాయణ , బిక్కే నాయక్ తదితరులు పాల్గొన్నారు.