సంక్రాంతి సెలవులు కేవలం ఆరు రోజులు మాత్రమే ఇచ్చారని, ఇవి సరిపోవని, కనీసం 18వ తేదీ వరకు సెలవులను పొడగించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కోరింది. ప్రతి ఒక్కరూ తమ సొంత గ్రామాలకు వెళ్లి ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని, పండుగ సందర్భంగా ఇచ్చే సెలవులను కేవలం 6 రోజులు మాత్రమే అనగా జనవరి 11 నుంచి 16 వరకు మాత్రమే ఇచ్చారని, ముఖ్యంగా 16 వతేది కనుమ పండుగ తర్వాత రోజునే బడులకు రావాలంటే సొంత గ్రామాలకు వెళ్ళిన విద్యార్ధులు, ఉపాధ్యాయులకు ఎంతో ఇబ్బంది అవుతుంది అని ఆ సంఘం జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి గౌస్ లాజమ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో సంక్రాంతి సెలవులు 10. రోజులకు తక్కువ కాకుండా ఇవ్వడం అందరికీ విదితమే అని, కనీసం జనవరి 18 వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు పొడిగించి 19 న పాఠశాలలు పునఃప్రారంభం చేయాలని కోరారు.