రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద ఆదివారం కోలాహలం నెలకొంది. రాప్తాడు నియోజకవర్గం తో పాటు వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, ఉద్యోగులు భారీగా చేరుకోవడంతో సందడి సందడి నెలకొంది. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి , ఎస్ వి వెటర్నరీ యూనివర్సిటీ బోర్డు మెంబర్ తోపుదుర్తి నయనత రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. ఈ ఏడాదిలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప ను కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బొకే అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.