వైకుంఠ ఏకాదశి సందర్భంగా ధర్మవరం పట్టణంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని సోమవారం పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోదరులు మాలగుండ్ల మల్లికార్జున, కుమారుడు మాలగుండ్ల పృథ్వీరాజ్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.