కొత్త ఏడాది సందర్భంగా గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని భారత్, పాక్ యథావిధిగా పాటించాయి. భారత్, పాకిస్థాన్ మధ్య భవిష్యత్‌లో ఉద్రిక్తతలు పెరిగిపోతే దాడులు చేయకూడదని అణు కేంద్రాలు, ఖైదీలు, స్థావరాలపై సమాచారాన్ని ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినప్పటికీ మూడు దశాబ్దాలుగా ప్రతీ ఏడాది జరిగే అణు సమాచారాన్ని ఇరుదేశాలు ఒకరికొకకు అందించుకున్నట్టుగా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.