రాజస్థాన్లో పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి జోధ్పూర్ వెళ్తున్న సూర్యనగరి ఎక్స్ప్రెస్కు చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. అయితే, ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సోమవారం తెల్లవారుజామున 3.27 గంటల సమయంలో రైలు పట్టాలు తప్పటంతో, 8 బోగీలు బోల్తాపడిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.