ఏపీకి చెందిన నేతలు రావెల కిషోర్, తోట చంద్రశేఖర్, పార్ధసారథి నేడు బీఆర్ఎస్ లో చేరనున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మండిపడ్డారు. తోట చంద్రశేఖర్ డబ్బులకు ఆశపడి బీఆర్ఎస్ లో చేరుతున్నారని, విలువలు లేని రాజకీయాలకు తోట తెరతీశారని విమర్శించారు. రావెల కిషోర్ బాబు అవినీతి చక్రవర్తి అంటూ పాల్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఏపీ నేతలు కేసీఆర్ కు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. నీతి నియమాలు లేనివారే కేసీఆర్ పార్టీలో చేరతారని ఆరోపించారు.