భార్య నగల చోరీ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త అయినా సరే, భార్య అనుమతి లేకుండా ఆమె నగలను తీసుకోవడం తప్పేనని స్పష్టం చేసింది. జస్టిస్ అమిత్ మహాజన్ సారథ్యంలోని డివిజన్ బెంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సదరు కేసులో భార్యను ఇంటి నుంచి తరిమేయటమే కాకుండా, ఆమె నగలను తీసుకెళ్లటం చేయరాదని, కేసు ప్రాథమిక దశలోనే ఉన్నందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వటం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది.