నోట్ల రద్దు పై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. నోట్ల రద్దును కొట్టి వేయలేమని, నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్దించింది. 2016లో కేంద్రం రూ.1000,500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీని పై 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటి పై విచారించిన సుప్రీం తీర్పునిచ్చింది. 2016 నవంబర్ 8న ఇచ్చిన నోటిఫికేషన్ సరైనదేనని న్యాయస్థానం అభిప్రాయపడింది.