టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్ కోలుకుంటున్నాడు. పంత్ ను ఐసీయూ నుండి రూమ్ కి షిఫ్ట్ చేసినట్టు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఇన్పెక్షన్ సోకకుండా ముందస్తు జాగ్రత్తగా పంత్ ను ప్రవేటు సూట్ కి మార్చినట్లు తెలిపింది. పంత్ చాలా వేగంగా కోలుకుంటున్నాడని, త్వరలోనే సాధారణ స్థితికి వస్తాడని పంత్ కుటుంబ సభ్యులతో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.