బెంగళూరులో వ్యాపారవేత్త ఎస్ ప్రదీప్ ఆదివారం నేతిగెరె సమీపంలో తన కారులో శవమై కనిపించాడు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గోపి, సోమయ్య సూచనల మేరకు ప్రదీప్ ఓ క్లబ్లో రూ.1.2 కోట్లు పెట్టుబడి పెట్టాడు. క్లబ్లో పనిచేసినందుకు జీతంతోపాటు ప్రతి నెలా రూ.3 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే డబ్బు ఇవ్వకుండా, తన పెట్టుబడి తిరిగి ఇచ్చేందుకు కూడా నిరాకరించారు. దాంతో ఆయన ఈ విషయాన్ని ఎమ్మెల్యే అరవింద్ లింబావలి దృష్టికి తీసుకెళ్లాడు. ఎమ్మెల్యే వారిని పిలిపించి మాట్లాడగా రూ.90 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే తనకు డబ్బులు ఇవ్వకుండా ఎమ్మెల్యే అండ చూసుకని తనను వేధించారంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ నోట్లో బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలితో పాటు ఆరుగురి పేర్లు రాశాడు.