బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా మూడోసారి లులా డ సిల్లా (76) ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైర్ బోల్సోనారోపై లులా విజయం సాధించారు. తమ అభిమాన నాయకుడి ప్రమాణాన్ని వీక్షించేందుకు ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వేదిక వద్దకు తరలివచ్చారు. లులా డ సిల్వా 2003-2010 మధ్య రెండుసార్లు అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా లులా డ సిల్వా గెలిచినప్పటి నుంచి బోల్సోనారో మద్దతుదారులు దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో లులా డ సిల్వా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భారీ భద్రత కల్పించారు.