పేదవారి ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్క లేదని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చంద్రబాబు 40 మందిని చంపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానుకల పేరుతో అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నార న్నారు. చంద్రబాబు వల్ల అమాయకులు పోతున్నా పవన్‌కు కనిపించడం లేదా? అని నిలదీశారు. కందుకూరు, గుంటూరు ఘటనలపై పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్..నోటికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా?. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారు. పవన్ ప్యాకేజీకి తప్ప..పాలిటిక్స్‌కు పనికి రాడని స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న గుంటూరులో ముగ్గురు ఆడవాళ్లు చనిపోతే ఆయన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.