సీనియర్ రాజకీయ నాయకుడు చేగొండి హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ సాధన కోసం నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. 85 ఏళ్ల హరిరామజోగయ్య నిరాహార దీక్ష చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆయన దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి పంపింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. నిరాహార దీక్ష చేస్తున్న హరిరామజోగయ్యతో ఫోన్ లో మాట్లాడినట్లు వెల్లడించారు. వయసు, ఆరోగ్యం దృష్ట్యా పదవీ విరమణ చేయాలని సూచించినట్లు తెలిపారు.