నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు సీఎం జగన్ను కలిశారు. తాజాగా తన విమర్శలకు వివరణ ఇచ్చాడు. తాజాగా కోటంరెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు వైసీపీకి ఇబ్బందికరంగా మారాయని తెలుస్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2,700 పింఛన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి రావత్ పైనా ఈ వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో రోడ్లు సరిగా లేవన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ ప్రభుత్వ వ్యతిరేక కోణంలో ప్రచారం చేయబడ్డాయి.