వాహనాల విక్రయాల్లో ఎలాన్ మస్క్ టెస్లా కార్ల కంపెనీ రికార్డు క్రియేట్ చేసింది. గత ఏడాది 13 లక్షల వాహనాలను డెలివరీ చేసినట్లు టెస్లా వెల్లడించింది. 2021తో పోలిస్తే గత ఏడాది 40 శాతం ఎక్కువ సంఖ్యలో వాహనాల్ని అమ్మినట్లు పేర్కొంది. గతేడాది చివరి ౩ నెలల్లోనే ఆ కంపెనీ సుమారు 4 లక్షల వాహనాల్ని డెలివరీ చేయడం విశేషం. తీవ్రమైన కోవిడ్ పరిస్థితుల్లోనూ తమ సరఫరాను నిలిపివేయలేదని టెస్లా కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.