చైనాలో కరోనా వేరియంట్ వేగంగా విజృంభిస్తుంది. భారత్‌లోనూ ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర పరిశోధన సంస్థ, సార్స్ కోవ్-2 జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియ్ ఇన్సకాగ్ (INSACOG) ఈ కొత్త వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా XXB వేగంగా విస్తరిస్తోందని, ముఖ్యంగా ఈశాన్య భారతంలో బీఏ 2.75 ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పింది. ఒమిక్రాన్, దాని ఉప రకాలు భారత్‌లో వేగంగా విస్తరిస్తున్నాయట. భారత్‌లో నమోదవుతున్న కేసుల్లో 63.2 శాతం ఎక్స్‌బీబీ వేరియంట్‌వే ఉన్నాయంటూ ఇన్సకాగ్ వెల్లడించింది.