గుత్తి మున్సిపాలిటీ పరిధిలో నూత నంగా 105 పింఛన్లు మంజూరు అయినట్లు కమిషనర్ లక్ష్మీదేవి సోమవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ నూతనంగా వృద్ధాప్య పింఛన్లు 35, వితంతు 40, వికలాంగుల పింఛన్లు 29, కల్లు గీత ఒకటి మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం పింఛన్లను పొందుతున్న లబ్ధిదారులలో అనర్హత నోటీసులు పొందిన వారు ఆందోళన చెందరాద న్నారు. అర్హత ధ్రువీకరణ పత్రాలను సంబంధిత సచివాలయంలో వెల్ఫెర్ కార్యదర్శికి అందించాలన్నారు. వాటి ని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి పింఛన్లు యధావిధిగా పంపిణీ చేస్తామన్నారు.