టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా బ్రెస్ట్ కేన్సర్ తో పోరాడుతున్నారు. ఈ విషయాన్ని సోమవారం ఆమెనె స్వయంగా ప్రకటించారు. ఇటీవల గొంతు పరీక్షలు చేయించుకోగా బ్రెస్ట్ కేన్సర్ నిర్ధారణ అయిందని.. ప్రస్తుతం న్యూయార్క్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కాగా, మార్టినా కు క్యాన్సర్ నిర్ధారణ అయిందన్న వార్త తెలుసుకుని సోషల్ మీడియాలో ఆమె అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు.