గుత్తి పట్టణంలోని టోల్ ప్లాజా వద్ద సోమవారం రాత్రి తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ పై డాబా నిర్వాహకులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. అనంతపురం వైపు నుండి హైదరాబాదు వెళుతున్న సేలంకు చెందిన డ్రైవర్ లోకనాథ్ గుత్తి టోల్ ప్లాజా వద్ద ఓ డాబా వద్ద లారీని నిలిపి భోజనం చేయాలని కూర్చు న్నాడు. ఐతే అతడు ఎంతసేపటికీ భోజనం ఆర్డర్ ఇవ్వకపోవడంతో డాబా నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తనవద్ద డబ్బులు లేవని తన మిత్రులు మరో లారీలో వస్తున్నారని డ్రైవర్ చెప్పాడు. ఐతే లారీని పక్కకు పెట్టాలని డాబా నిర్వాహకులు అతనితో తగవుకు దిగారు. దీంతో ఇరువురు మధ్య వాదోపవాదాలు జరిగి డాబా నిర్వా హకులు ఇనుపరాడ్లతో డ్రైవర్ పై దాడి చేశారు. ఈ ఘర్షణలో గాయ పడ్డ డ్రైవర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.