పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో విద్యుత్ ప్రధాన లైన్ తెగి కింద పడిపోవడంతో మంగళవారం గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పై సిపిఎం నాయకులు గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. బిల్లులు కట్టించుకోవడం కోసం ఇంటి దగ్గరికి వచ్చి డిమాండ్ చేస్తారు. ప్రజల ప్రాణాలు పోతున్న అధికారులు పట్టించుకోవడంలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పాత విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేపట్టి కొత్త విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.