ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏం చేసినా సంచలనమే. తాజాగా సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్ జట్టు అల్-నాసర్‌తో రొనాల్డో 215 మిలియన్ డాలర్ల విలువైన డీల్ చేసుకొన్నాడు. డీల్ జరగడానికి ముందు అల్-నాసర్ జట్టు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కేవలం 8.6 లక్షలు మాత్రమే. కానీ, డీల్ జరిగిన 48 గంటల్లో దాదాపు 30 లక్షలకు చేరగా మంగళవారం ఉదయం నాటికి ఆ ఫాలోవర్ల సంఖ్య 78 లక్షలకు ఎగబాకింది. ఇక రొనాల్డోని ఇన్‌స్టాలో సీఆర్7ను 527 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.