రాజమండ్రి సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ 'ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి, చంపేసిన చంద్రబాబే మొసలి కన్నీరు కారుస్తారు. చంద్రబాబుకు తెలిసింది ఫోటో షూట్లు, డ్రోన్ షాట్లు, డ్రామాలు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పుష్కరాల్లో డ్రోన్ షాట్ల కోసం 29 మందిని చంపేశారు. కందుకూరులో జనాన్ని ఎక్కువ చూపించేందుకు చిన్న సందులో ప్రజల్ని నెట్టారు. తన డ్రోన్ షాట్లు, ఫోటో షూట్ల కోసం 8 మందిని చంపేశారు. తానే మనుషులను చంపేస్తాడు, మళ్లీ మానవతావాదిగా డ్రామాలాడుతారు. పైగా చనిపోయిన వారు టీడీపీ కోసం ప్రాణత్యాగం చేశారని చెబుతాడు. 8 మందిని చంపినా ఆ పెద్ద మనిషికి రక్తదాహం తీరలేదు. కొత్త సంవత్సరం రోజున డ్రోన్ షాట్ల కోసం గుంటూరులో మరో ముగ్గురిని చంపేశారు. దత్తపుత్రుడు ఇవేమీ ప్రశ్నించరు.' అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa