యాడికి పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో మంగళవారం ఇరు వర్గాలు ఘర్షణ పడటంతో నలుగురు గాయపడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు నారాయణస్వామి, భీమారావు ఇల్లు పక్కపక్కనే ఉన్నాయి. డిసెంబరు 31వ తేదీ రాత్రి ఒకరికి చరవాణిలో అసభ్యకరంగా మాట్లాడారని వాదించుకున్నారు. వివాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. పోలీసులు ఇరు కుటుంబాలకు సర్దిచెప్పి పంపారు. తిరిగి మంగళవారం రెండు కుటుంబాల్లోని యువకులు, మహిళలు రాళ్లు, కారంపొడి చల్లుకుని పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీనిలో గాయపడిన నలుగురిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.