బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం రామాపురం శివారులలో వెలిసిన కోడిపందాల స్థావరంపై ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసు బృందం మంగళవారం మధ్యాహ్నం మెరుపు దాడి చేసిందిఈ సందర్భంగా ఎనిమిది మంది పందెం రాయుళ్లు దొరికారు. వారినిఅరెస్టు చేసి 1200 రూపాయలు నగదు, 10 ద్విచక్ర వాహనాలు, 10 మొబైల్ ఫోన్లను స్వాధీన పరచుకున్నారు. సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలను ట్రాక్టర్లో పోలీస్ స్టేషన్ కు తెచ్చారు. కాగా పోలీసులను చూసి ఇంకా చాలామంది పరారైనట్లు, వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నామని ఎస్ఐ సురేష్ మీడియాకు చెప్పారు. సంక్రాంతి సందర్భంగా మండలంలో ఎవరూ జూద కార్యకలాపాలు నిర్వహించరాదని, నిరంతరం దాడులు నిర్వహిస్తామని, పట్టుబడిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.