చంద్రబాబు సభలకు వస్తున్న జన సునామిని, నారా లోకేష్ బాబు యువ గళం పాదయాత్రకు లభించబోయే జనాదరణను ముందుగానే ఊహించి ఓర్వలేక సీఎం జగన్ జడిసిపోయి రోడ్లమీద బహిరంగ సభలకు, ర్యాలీలకు నిషేధిస్తూ జీవో తీసుకురావటం అప్రజాస్వామికమని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం పత్రిక ముఖంగా పేర్కొనారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై బాదుడే బాదుడు, ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల ద్వారా ప్రజల తరపున చంద్రబాబు పోరాడుతున్నారన్నారు. వైసిపికి రాబోయే ఎన్నికలలో గట్టిగా బుద్ధి చెబుతారన్నారు.