రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని, 22ఎ దరఖాస్తులు పరిష్కరించాలని, ఈ కే వైసి పూర్తి చేయాలని, మ్యుటేషన్ లను పూర్తి చేయాలని, ఎస్సీ హ్యాబిటేషన్లలో స్మశాన స్తలాలను శనివారం లోగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎం. హారినారాయణన్ అన్నారు.
మంగళవారం రీ సర్వే, వివిధ రెవెన్యూ సమస్యలపై అర్ డి ఒ లు, కలెక్టరేట్ సూపరిండెన్ట్ లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వేలో 823 గ్రామాలకు గాను 753 గ్రామాల్లో రీ సర్వే పనులకు సంభందించి డ్రోన్ సర్వే పూర్తి అయిందని, 253 గ్రామాలకు సంభందించి ఒ అర్ ఐ లు రాగా200 సక్రమంగా ఉన్నాయని మొదటి దశలో 134 పూర్తి కాగా 53 ఒ అర్ ఐ లు క్వాలిటీ లో ఫెయిల్ అయ్యాయని 66గ్రామాలకు సంభందించి సర్వే కార్యక్రమాలు వివిధ దశలలో జరుగుతున్నాయి అని అన్నారు.