టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో సభలు, రోడ్ షోలకు అనుమతి నిరాకరించారు. అయినా షెడ్యూలు ప్రకారమే చంద్రబాబు పర్యటన కొనసాగుతుందని కుప్పం టీడీపీ నేతలు వెల్లడించారు. చంద్రాబాబు పర్యటనలో నిబంధనలు అమలు చేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని, వాటికి సమాధానం ఇచ్చినా పోలీసులు స్వీకరించలేదని టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పీఎస్ మునిరత్నం ఆరోపించారు. మరోవైపు అనుమతి లేకుండా పర్యటన కొనసాగిస్తే నిర్వాహకులు, పాల్గొనే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.