టోక్యోలో పెరిగిపోతున్న జనాభాను నియంత్రించలేకపోతున్న జపాన్ ప్రభుత్వం మరో ఆఫర్ ప్రకటించింది. టోక్యోను వీడి వెళ్లే వారికి 10 లక్షల యెన్ లు (దాదాపు రూ.6.35 లక్షలు) ఇవ్వనుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి రానుంది. జననాల రేటు తక్కువగా ఉన్న, వృద్ధులు అధికంగా ఉన్న ప్రాంతాలకు కుటుంబాలు తరలివెళ్లేందుకు 2019 నుంచి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. టోక్యోకు ప్రజలు పోటెత్తుతుండడంతో మిగిలిన పట్టణాల్లో జనాభా తగ్గిపోయి సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయి.