త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ దేవ్ ఇంటిపై దుండగులు మంగళవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. ఉదయ్ పూర్ లోని ఆయన ఇంట్లో తన తండ్రి సంవత్సరీకం కార్యక్రమంలో భాగంగా యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్న పూజారుల బృందంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. వారి వాహనాలకు నిప్పుపెట్టారు. మాజీ సీఎం ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు. దీంతో ఇళ్లు, ఓ దుకాణం అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారరం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ దాడిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.