ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలా? ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటే ప్రతిరోజూ సరిపడా నీళ్లు, పానీయాలు తాగితే సరిపోతుందంటున్నారు పరిశోధకులు. అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎవరైతే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకుంటారో వారు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా దీర్ఘకాలం బతికేస్తారని పరిశోధకుల పరిశీలనలో రుజువైంది. రోజూ తక్కువగా నీళ్లు తాగుతున్న వారు వ్యాధులతో అధికంగా బాధ పడుతున్నట్లు తేల్చారు.