బీహార్ కు చెందిన స్టంట్స్ రారాజు, హెడ్ మ్యాన్ ధర్మేంద్ర కుమార్ మరో రికార్డును సృష్టించాడు. భజంపై 122 కేజీల బైకును మోస్తూ కేవలం 30 సెకన్లలోనే 100 మీటర్లు పరిగెత్తాడు. డిసెంబరు 31న త్రిపుర రాజధాని అగర్తలాలో బైక్ మోస్తూ పరిగెత్తే పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 21 దేశాలకు చెందినవారు పోటీపడ్డారు. ధర్మేంద్ర కుమార్ 115.45 సీసీ బైకును భుజంపై వేసుకొని పరిగెత్తి విజయం సాధించాడు. దీంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సొంతం చేసుకున్నాడు.